మంత్రి కన్నా కారులో పీఅర్పీ ఎమ్మెల్యే 'శీను'

ముందుగా మంత్రి కారులో దిగి ఆలయంలోకి వెళ్లగా ఆ తర్వాత పీఆర్పీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కూడా ఆలయంలోకి వచ్చారు. ఇద్దరూ కలిసి విఘ్నేశ్వరస్వామివారికి పూజలు చేశారు. మీడియా ప్రతినిధులు పీఆర్పీ ఎమ్మెల్యేను కాంగ్రెసులో చేరుతున్నారా అంటూ ప్రశ్నలు వేశారు. పీఆర్పీ అధినేత చిరంజీవి జిల్లా పర్యటనలో ఉండగా కాంగ్రెసు పార్టీ మంత్రితో కలిసి పర్యటించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటవేస్తూ పాడేరులో జరుగుతున్న మోదమాంబ ఉత్సవాలకు వెళ్తూ మంత్రి కారెక్కానని, మళ్లీ సాయంత్రం చిరంజీవి పర్యటనలో పాల్గొంటానని ఆయన బదులిచ్చారు.












Click it and Unblock the Notifications