అవసరమైతే రైతుల వద్దకు చిరు పాదయాత్ర

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధన కోసం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేపట్టిన బస్సుయాత్ర జిల్లాలోకి రెండోసారి ప్రవేశించింది. ఐదో తేదీన అంతర్వేదిలోయాత్రను ప్రారంభించిన చిరంజీవి ఏడో తేదీన విశాఖ జిల్లాకు వెళ్లారు. అనంతరం మళ్లీ సోమవారం అర్ధరాత్రి నర్సీపట్నం నుంచి అన్నవరం వచ్చారు. మంగళవారం ఉదయం సత్యదేవుని దర్శించిన అనంతరం జిల్లా యువరాజ్యం, మహిళారాజ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర రౌతులపూడి, శంఖవరం, ఒమ్మంగి, ప్రత్తిపాడు, కిర్లంపూడి, దివిలి మీదుగా అర్ధరాత్రికి పెద్దాపురం చేరుకుంది












Click it and Unblock the Notifications