న్యూఢిల్లీ: "నిజాయితీయే నా ఆస్ధి" అని ప్రకటించుకున్న ఎన్ హ్చ్ కపాడియా సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ బాలకృష్ణన్ పదవీ కాలం ముగియటంతో ఆయన స్థానంలో కపాడియా ఈబాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిభవన్‌లో బుధవారం ఉదయం కపాడియాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ జస్టిస్ బాలకృష్ణన్ తదితరులు హాజరు అయ్యారు. కాగా నిజాయితీకి కట్టుబడి ఉండటమే తన ఆస్తి అని కపాడియా పేర్కొన్నారు.