వరంగల్: వరంగల్ జిల్లాలోని మండలకేంద్రమైన గూడూరులో ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకుకు వెనుకభాగంలో ఉన్న గ్రిల్స్ తొలగించి లోపలకు ప్రవేశించిన దొంగలు లాకర్లు పగులగొట్టి 50 లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. ఉదయాన్నే ఈ విషయాన్ని చూసిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలా ఉండగా మరో సంఘటనలో బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతున్న రఘు అనే వ్యక్తిని బుధవారం చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు, పలు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.