కన్నాపై కేంద్రం విచారణ: రాయపాటి

తన పేరు మీద విడుదలైన నకిలీ లేఖపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులే అసలు విషయం తేలుస్తారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మి నారాయణపై తాను చేసిన అభియోగాలు వాస్తవమని ఆయన అన్నారు. కొన్నాళ్ల క్రితం రేకుల షెడ్డులో ఉన్న కన్నా లక్ష్మినారాయణ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన కన్నా లక్ష్మినారాయణ ఆస్తుల వివరాలు తేలాలని ఆయన అన్నారు. ఫోర్జరీ లేఖలో కొందరు మంత్రుల పేర్లు ఉన్నందుకు వారికి తాను క్షమాపణ చెబుతున్నానని, లేఖను తాను రాయకపోయినప్పటికీ తన పేరు మీద ఆ లేఖ విడుదలైనందున తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications