రోడ్డు ప్రమాదంలో 4 గురు కూలీల మృతి

Mahaboob Nagar
మహబూబ్‌ నగర్‌: మహబూబ్ ‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం మాలపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపు తప్పి ఉపాధి కూలీ పనులు చేస్తున్న నలుగురు కూలీలను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నిన్న జరిగిన మరో ప్రమాదం వివరాలు: మిడ్జిల్‌ మండలం బోయిన్‌ పల్లి వద్ద శనివారం రాత్రి పదిగంటల సమయంలో పెళ్లి ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాలు...తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపురం నుంచి పెళ్లి బృందం ట్రాక్టర్‌లో తిమ్మాజీపేట మండలం నేరెళ్లపల్లికి బయల్దేరింది. ట్రాక్టర్‌ బోయినపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదంలో వెంకటాపురానికి చెందిన సత్యమ్మ(50), వసంత(30), నేరెళ్లపల్లికి చెందిన సుగుణమ్మ(35), చాకలి బుచ్చయ్య (50) అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా చెల్లాచె దురై సమీపంలోని పొదల్లో పడ్డారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పెళ్లికూతురు యాదమ్మ క్షేమంగా బయటపడింది. గాయపడిన వారిని 108లో జడ్చర్ల, కల్వకుర్తి ఆస్పత్రులకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+