ఆంధ్రకు తుపాను ముప్పు

వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా వేయి కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది. అది తుఫానుగా మారి ఆంధ్రలో తీరాన్ని దాటవచ్చునని అంటున్నారు. ఈ ముప్పు నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. సముద్రంలోకి వేటకు వెళ్లినవారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. పెను గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.












Click it and Unblock the Notifications