హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ను అడ్డుకునే హక్కుంది: దామోదర్

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ పర్యటన చేస్తే తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను అడ్డుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కుందని, అయితే పర్యటనలను అడ్డుకోవడం కూడా నిరసన తెలియజేయడమేనని, నిరనస తెలిపే హక్కు కూడా ప్రజాస్వామబద్దమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దివంగత నేత, జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తాను ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారని, అయితే జగన్ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా ముందుకు వచ్చారని, అందువల్ల తెలంగాణ ప్రజలు జగన్ ను వ్యతిరేకిస్తున్నారని ఆయన వివరించారు.

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున నాయకుల పర్యటనలు కూడదని చెప్పారని, అందువల్ల జగన్ తెలంగాణలో జగన్ పర్యటించడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ తన తెలంగాణ పర్యటనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామగ్రామాన ఉద్రిక్త వాతావరణం ఉందని, అందువల్ల తెలంగాణలో సీమాంధ్ర నాయకులు పర్యటించడం మంచిది కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ తెలంగాణ పర్యటన తమ పార్టీకి అనుకూలమా, ప్రతికూలమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం కాదని, ఉప ఎన్నికలపై తమ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ విషయం చూసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని, అంతర్యుద్ధం తలెత్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ చేసిన ప్రకటనతో ఆయన ఏకీభవించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X