జగన్ యాత్రనే వ్యతిరేకిస్తున్నా: ఎర్రబెల్లి

జగన్ ఒక్కరే వ్యక్తిగతంగా వచ్చి బాధితులకు సాయం అందించినా తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయార్భాటంతో సాగుతుంది కాబట్టే తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలో బాబ్లీ సహా 12 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వీలు కల్పించారని, దీనివల్ల తెలంగాణ, ముఖ్యంగా తమ వరంగల్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, అటువంటి వైయస్ కుమారుడు జగన్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తానంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. వైయస్ వరంగల్ జిల్లాలోని పరిశ్రమలను విక్రయించారని, భూములను కబ్జా చేయించారని, తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ స్థితిలో జగన్ వరంగల్ జిల్లా పర్యటన మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications