నేడు ఢిల్లీ వెళ్ళనున్న రోశయ్య, డిఎస్

ఇప్పటికేరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి సీఎం రోశయ్య నివేదిక పంపినట్లు తెలిసింది. రోశయ్య అనుకూల వర్గం వై.ఎస్. ప్రవేశపెట్టిన పథకాలను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు జగన్ వర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది. పరస్పర విరుద్ధ భావనల నేపథ్యంలో సీఎం, డీఎస్ ల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో లైలా తుపాను ప్రభావం, కేంద్రసాయం తదితర అంశాలపైచర్చించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను సీఎం వారి దృష్టికి తీసుకెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications