చిరు ధైర్యవచనాలు ఫలించేనా?

మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారు చాలా మంది ఉన్నారని, వారందరితో పార్టీని పునర్నిర్మిద్దామని ఆయన చెప్పారు. పార్టీకి అభిమానులు, కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్న ప్రతిసారీ చెప్పే మాటే మరోసారి చిరంజీవి చెప్పారు. అయితే, ఆయన మాటల మంత్రం ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. పార్టీని పునర్నిర్మించడానికి, దాని శక్తియుక్తులు అందించడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. ఈ స్థితిలో ఆయన చెప్పే ధైర్యవచనాలు ఏ మేరకు పనిచేస్తాయనేది సందేహమే.












Click it and Unblock the Notifications