వైయస్ జగన్ యాత్రకు ఆటంకాలు గుండెపోటుతో వ్యక్తి మృతి
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: వైయస్ జగన్ వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకుంటున్నారని మనస్తాపానికి గురై వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి హఠాన్మరం చెందాడు. జగన్ యాత్రను అడ్డుకుంటామనే వార్తలను టీవీల్లో చూసిన బచ్చన్నపేటకు చెందిన యాదగిరి అనే వ్యక్తి మనస్తాపానికి గురై గుండెపోటుతో ఆత్మహత్య చేసుకున్నాడు.
యాదగిరి కూలీపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని మరణంతో కుటుంబం అనాథ అయింది. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతని భార్య కూడా కూలీపనులు చేస్తుంది.