హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనకు మంచి స్థానాన్నే కల్పించారని, అయితే అభిమానుల కోరిక మేరకు తాను తెలుగుదేశం పార్టీలో చేరానని మాజీ మంత్రి కళా వెంకటరావు అన్నారు. ఆయన బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన సొంత గూటికి చేరుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తనకు కీలక స్థానమే కల్పించారని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీకి కళా వెంకటరావు ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆయన ఫాక్స్ ద్వారా చిరంజీవికి పంపారు.