కెసిఆర్ కు జగన్ భయం: సురేఖ

జగన్ యాత్రను అడ్డుకుంటామని ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ కూడా గుర్రుమన్నారు. వైయస్ కుమారుడిగా బాధిత కుటుంబాలకు పరామర్శించడం జగన్ బాధ్యత అని ఆయన అన్నారు. జగన్ యాత్రను అడ్డుకోవాలని చెబుతున్న తెలంగాణవాదులు తెలంగాణ మంత్రులు ఆంధ్రకు వెళ్లొద్దని చెబుతారా అని కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ్ రావు ప్రశ్నించారు. జగన్ యాత్రతో తెలంగాణ సెంటిమెంట్ మాసిపోతుందా అని పిసిసి కార్యదర్శి జనక్ ప్రసాద్ ప్రశ్నించారు. కెసిఆర్ ట్రాప్ లో పడొద్దని ఆయన కాంగ్రెసు నాయకులకు హితవు పలికారు. జగన్ యాత్రను అడ్డుకోవాలనే తెలంగాణవాదుల నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు తప్పు పట్టారు. శాసనసభ్యుడు శైలజానాథ్, పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి తెలంగాణవాదుల నిర్ణయంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications