కరీంనగర్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. వీరు కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందినవారు. ఆయిలో ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మూడు రోజుల క్రితమే సౌదీ అరేబియాలోని రియాద్ కు వెళ్లారు.
మరణించిన ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారే. ఓ వ్యక్తితో పాటు అతని కుమారుడు, అల్లుడు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇస్లాంపూర్ లోని ఆ కుటుంబ సభ్యుల్లో విషాద వాతావరణం నెలకొంది.