తెలంగాణ యాత్రపై అమీతుమీకే జగన్ నిర్ణయం

యాత్రను వాయిదా వేసుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ చేసిన సూచనపై తన అనుచరులతో మాట్లాడి చెబుతానని జగన్ చెప్పారు. ఆ వెంటనే ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. యాత్రను వాయిదా వేసుకోవద్దని జగన్ కు అనుచరులు సూచించినట్లు తెలుస్తోంది. జగన్ వరంగల్ జిల్లా యాత్ర సాగుతుందని సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యుడు ఎరాసు ప్రతాప రెడ్డి చెప్పారు. అలాగే, జగన్ యాత్రను ఆపాలని గానీ యాత్రలో పాల్గొనవద్దని గానీ తమకు అధిష్టానం నుంచి ఏ విధమైన ఆదేశాలు రాలేదని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే జగన్ యాత్రను కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications