వైయస్ జగన్ తెలంగాణ యాత్ర వ్యక్తిగత లాభం కోసమేనా?

ఓదార్పుయాత్ర పేరుతో జగన్ పర్యటిస్తున్న తీరుపైనా అధిష్ఠానానికి ఇప్పటికే చాలా ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది. యాత్ర రాజకీయ పర్యటనలాగా ఉంటోంది తప్ప పరామర్శలకు పరిమితం కావడం లేదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. పర్యటనకు జగన్ పోస్టర్లు తదితర హంగులతో ఆర్భాటం చేస్తున్నారని, అది వ్యక్తిగత పర్యటనలాగా లేదని పార్లమెంటు సభ్యులు చెప్పినట్లు సమాచారం.
ఓదార్పుయాత్రను పార్టీతో సంబంధం లేని వ్యక్తిగత పర్యటనగా జగన్ చెప్పటాన్ని కొందరు కాంగ్రెసు నాయకులు తప్పుపడుతున్నారు. అందరూ ఇలా సొంత పర్యటనలు చేసుకుంటూ వెళ్తే చివరకు పార్టీయే ఉండదని హెచ్చరిస్తున్నారు. జగన్ పర్యటన వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందన్న డీజీపీ వ్యాఖ్యలు కూడా అధిష్ఠానంపై ప్రభావం చూపి ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications