తూ.గోలో కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం

'తెలంగాణ కేసీఆర్ సొత్తా' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన ఆగిపోతుందేమోనని మనస్తాపం చెంది వరంగల్ జిల్లాకు చెందిన యాదగిరి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతోనైనా కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. తొలుత కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను గ్రామంలో ఊరేగించి పసలపూడి వైయస్‌ఆర్ బైపాస్ రోడ్డు వద్ద దహనం చేశారు. అనంతరం కాకినాడ - మండపేట రహదారిపై రాస్తారాకో చేశారు. కార్యకర్తలు చింతా వెంకట సుబ్బారెడ్డి, నల్లమిల్లి భాస్కరరెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, బోనగిరి వెంకట రమణ, కొల్లి సుదర్శన్, నల్లమిల్లి లచ్చారెడ్డి, కొవ్వూరి నాగిరెడ్డి, సాయిబాబారెడ్డి పాల్గొన్నారు.
వైయస్జగన్ పర్యటనతో తెలంగాణ వాదం జన ప్రవాహంలో కొట్టుకుపోతుందన్న భయంతో ఓదార్పు యాత్రను కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని రాయవరం జెడ్పీటీసీ సభ్యుడు కర్రి వెంకటరెడ్డి, ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు నిమ్మకాయల దోసారావు విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications