యాత్ర వద్దన్న మొయిలీ: సంప్రదించి చెప్తానన్న జగన్

Veerappa Moily
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సూచించారు. ఆయన గురువారం ఉదయం జగన్ కు ఫోన్ చేశారు. ఓదార్పు యాత్రపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల యాత్రను వాయిదా వేసుకోవాలని మొయిలీ జగన్ తో అన్నట్లు సమాచారం. అయితే, తన అనుచరులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని జగన్ మొయిలీతో చెప్పినట్లు తెలుస్తోంది.

జగన్ వరంగల్ జిల్లా యాత్ర రద్దయ్యే సూచనలున్నాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య చెప్పారు. ఆయన గురువారం ఉదయం మొయిలీని కలిసి తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జగన్ యాత్రను అనుమతించవద్దని కోరారు. మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణ పరిస్థితుల దృష్ట్యా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని రాజయ్య జగన్ ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+