హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ యాత్రపై మీడియా మీద సిఎం రోశయ్య రుసరుసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ యాత్రపై ముఖ్యమంత్రి కె. రోశయ్య మీడియా మీద రుసరుసలాడారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వేసిన ప్రశ్నలకు ఆయన చిర్రుబుర్రులాడారు. వైయస్ జగన్ తెలంగాణలో చేపట్టే ఓదార్పు యాత్రపై తనకు సమాచారం లేదని ఆయన అన్నారు. జగన్ యాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసులను అదేశించినట్లు ఆయన తెలిపారు. జగన్ యాత్రకు అనుమతి ఉందా అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.

బిజెపి నేత సుష్మా స్వరాజ్ సభకు, తెలంగాణ విద్యార్థుల సభకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎలా అనుమతి ఇచ్చిందని అడిగినప్పుడు ఆయన కాస్తా చిరాకు పడ్డారు. పరిస్థితి వేరని, తెలంగాణ విద్యార్థులు తమ కార్యక్రమాలకు పోలీసుల అనుమతి అడిగారని, పోలీసులు అనుమతి నిరాకరించారని, జగన్ అనుమతి అడగలేదని ఆయన చెప్పారు. అనుమతి ఇవ్వాలని అడగడమే తప్పా అని ఓ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఆయన మరింతగా చిరాకు పడ్డారు. నేను అలా అన్నానా, అలా అనలేదు, అనని విషయాన్ని నాకు అంటగడతారేమిటని ఆయన అన్నారు. జగన్ అనుమతి ఇవ్వాలని అడిగితే ఏం చేస్తారని అడగాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు.

సమస్యను సర్దుబాటు చేయడానికి మీడియా ప్రతినిధులు అడగాలని ఆయన అన్నారు. తమ బాధ్యత తాము నిర్వర్తిస్తున్నామని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని, అన్నీ తన దాకా రావని ఆయన చెప్పారు. జగన్ తెలంగాణకు రావాలనే వాళ్లున్నారు, వద్దనే వాళ్లున్నారని ఆయన అన్నారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే సమస్య తెలత్తే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు నివారించలేకపోయారని అడిగితే ఆయన సరిగా సమాధానం ఇవ్వలేదు. జగన్ పర్యటన విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని, అది తన పరిధిలో లేదని చెప్పారు. ఆర్కియాలజీ శాఖను సంప్రదించి శ్రీకాళహస్తి రాజగోపురాన్ని పునర్నించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X