హైకమాండ్ చెప్పినా వైయస్ జగన్ వినడా?: సిఎం రోశయ్య

రోశయ్య మంత్రులతో జగన్ యాత్రపైనే సమీక్షించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా అధిష్టానం సూచనలను పాటించాల్సిందేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్ ఓదార్పు యాత్రను ఆపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తోంది. జగన్ యాత్ర జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై రోశయ్య మంత్రులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రులు హాజరు కాలేదు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఆలస్యంగా వచ్చారు.












Click it and Unblock the Notifications