జగన్ కాన్వాయ్ ని పేల్చేస్తాం: తెలంగాణ లిబరేషన్ ఆర్మీ

YS Jagan
వరంగల్: వరంగల్ జిల్లా పర్యటనకు వస్తే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కాన్వాయ్ ని పేల్చేస్తామని హెచ్చరిస్తూ తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర రాసిన ఓ లేఖ పోలీసులకు లభించింది. జిల్లాలోని మహబూబా బాద్ బస్ స్టాండులో పోలీసులు శక్తివంతమైన టైంబాంబును కనుక్కున్నారు. ఆ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ బాంబును 300 అడుగుల దూరం నుంచి పేల్చడానికి వీలవుతుందని పోలీసులు అంటున్నారు.

నల్లటి బ్యాగులో మహబూబా బాద్ నాలుగో నెంబర్ ఫ్లాట్ ఫారంపై ఉన్న బాంబు పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు బస్సు స్టాండు నుంచి ప్రజలను బయటకు పంపించి వేశారు. అక్కడే పోలీసులకు తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర ఓ లేఖ దొరికింది. జగన్ కాన్వాయ్ ని పేల్చేస్తామంటూ ఆ లేఖలో రాసి ఉంది. లేఖలోని పూర్తి వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.

తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర ఏ సంస్థ కూడా లేదని అంటున్నారు. బాంబు ఎవరు పెట్టి ఉంటారనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసాంఘిక శక్తులా, మరెవరనేది వారు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం మహబూబా బాద్ లో జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ బాంబు లభించడం ఆందోళనకు గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+