వైయస్ జగన్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఓదార్పు యాత్రకు శుక్రవారం తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. వైయస్ జగన్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు ముందుకు సాగకుండా అడ్డుపడేందుకు తెలంగాణవాదులు అడ్డుపడుతున్నారు. దీంతో ఆయన యాత్రలో జాప్యం జరుగుతోంది. నల్లగొండ జిల్లా భువనగిరి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెసును అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తున్నారు. ఆలేరులో కూడా జగన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల ప్రాంతంలో భువనగిరి నుంచి ఇంటర్ సిటీ బయలుదేరింది. భువనగిరి సమీపంలో రాయగిరిలో పోలీసులు 50 మంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. ఆలేరులో 20 మందిని అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్లలో కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది.

జగన్ యాత్ర సందర్భంగా మహబూబాబాద్ లో, వరంగల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్నాయి. వరంగల్ కోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. కోర్టు ఆవరణలో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు పెద్ద యెత్తున మహబూబాబాద్ చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన పరిస్థితి నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+