అట్టుడుకుతున్న తెలంగాణ, రాయలసీమ

వైయస్ జగన్ అరెస్టు వార్త విన్న వెంటనే రాయలసీమలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలనకొన్నాయి. జగన్ అభిమానులు తిరుపతిలో వీధుల మీదికి వచ్చి విధ్వంసానికి దిగారు. దుకాణాలను, బస్సులను ధ్వంసం చేశారు. ప్రజలపై దాడులు చేశారు. తిరుమల భక్తులను కూడా వారు వదిలిపెట్టలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. జగన్ వార్త విన్న వెంటనే ఆయన బాబాయ్, కాంగ్రెసు ఎమ్మెల్సీ కడప జిల్లా జమ్మలమడుగులో ధర్నాకు దిగారు. ఓ పెళ్లికి హాజరైన ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కడప మేయర్, దివంగత నేత వైయస్ బావమరిది రవీంద్రారెడ్డి జగన్ అరెస్టుపై మండిపడ్డారు. కడప బంద్ కు ఆయన పిలుపునిచ్చారు. జగన్ అరెస్టును కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్ అరెస్టును ఖండించారు. పోలీసుల అసమర్థత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్సించారు.












Click it and Unblock the Notifications