వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లు అరవింద్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వం: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: రాజ్యసభ టికెట్ ను తన బావ మరిది అల్లు అరవింద్ కు ఇవ్వబోమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. సి. రామచంద్రయ్యను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసును రాజ్యసభ సీటు అడిగినట్లు ఆయన చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. రాజ్యసభకు పోటీ చేయాలనే ఉద్దేశం అల్లు అరవింద్ కు కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో జరిగే చిరంజీవి సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై సమావేశంలో చర్చించారు. పార్టీ విలీనం ప్రతిపాదనను తిరస్కరించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రాజ్యసభ సీటును పొందేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

రాజ్యసభ ఎన్నికల్లో తమఅభ్యర్థికి మద్దతివ్వమని కాంగ్రెస్‌ని అడగాలని ప్రజారాజ్యం రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఒకవేళ కాంగ్రెస్‌కున్న అంతర్గత ఇబ్బందులతో తమకు మద్దతిచ్చే పరిస్థితి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవగాహనతో వ్యవహరించాలని పార్టీ సమావేశం అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కుండే ఇబ్బందుల దృష్ట్యా తమకు మద్దతివ్వలేని స్థితి ఏర్పడితే రాజ్యసభ కోసం గట్టిగా పట్టుబట్టరాదని కొందరు సీనియర్‌ నేతలు సూచించారు.

రాజ్యసభ ఎన్నికల్లో సొంతంగా గెలిచే బలం లేనందున భావసారుప్య పార్టీలతో పొత్తులకు సిద్ధమని తాము ప్రకటించిన మేరకే కాంగ్రెస్‌ స్పందించిందని ప్రజారాజ్యం పార్టీ స్పష్టం చేసింది. పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు విలేకరులతో మాట్లాడారు. సోనియాతో జరిగే సమావేశంలో పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు అనుమతికోరతామన్నారు. ప్రభుత్వంలో చేరమని సోనియా ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. లౌకికత్వం, సామాజికన్యాయం వంటి అంశాల్లో కాంగ్రెస్‌, ప్రరాపాది ఒకే విధానమని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X