నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీతో రాష్ట్రానికి న్యాయం: ఆనం

By Santaram
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
నెల్లూరు: శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికతో రాష్ట్రంలో పరిస్థితి చక్కబడుతుందని మునిసిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన రెడ్ది ఓదార్పు యాత్రని ఒక ప్రాంతీయ పార్టీ అడ్డుకోవడం బాధాకరమన్నారు.

ఇలా ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా శ్రీకృష్ణ కమిటీ ఏడో విడత పర్యటన యథాతథంగా సాగనుంది. జూన్‌ ఒకటో తేదీన కమిటీ సభ్యులు రాష్ట్రానికి వస్తారు. మంగళవారం ఆలిండియా బంజారా సేవాసంఘం, తెలంగాణ రచయితల వేదిక, ప్రజాస్వామ్య తెలంగాణ సమితి, ఉత్తరాంధ్ర రక్షణ సమితి వేదిక, మన్యసీమ సాధన సమితి, రాయలసీమ మేధావుల ఫోరం, రాష్ట్ర స్వాతంత్య్ర సమర యోధుల వేదికతో భేటీ అవుతుంది.

బుధవారం తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల ఫోరం, రాయలసీమ రాష్ట్ర సాధన సమితి, తెలంగాణ విమోచన సమితి, ఉద్యమ జేఏసీతో పాటు విశ్రాంత సైనికాధికారి జి.బి.రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సమావేశం నిర్వహిస్తుంది. రెండో తేదీ రాత్రి కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోతారు. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ రావడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X