కాంగ్రెసుకు దాసరి నారాయణరావు దూరం, చిరంజీవి చేరువ?

తాము చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనే అనుమానంతో దాన్ని నివారించడానికి కాంగ్రెసు పార్టీకి కాపు సామాజిక వర్గం కాంగ్రెసు పార్టీకి ఓటేసేందని, దాని వల్లనే ప్రజారాజ్యం దెబ్బ తిని కాంగ్రెసు గెలిచిందనే భావన ఉంది. ఈ స్థితిలో చిరంజీవిని తమ వైపు లాక్కోవడం ద్వారా కోస్తాంధ్రలో కాపు సామాజిక వర్గం మద్దతు అప్రయత్నంగానే తమ వైపు ఉంటుందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమాచారం అందినట్లు సమాచారం. అందువల్లనే చిరంజీవితో చేతులు కలపడానికి ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు.
కాగా, రాజకీయాలతో విసిగిపోయిన దాసరి నారాయణ రావు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, తాను తీసిన యంగ్ ఇండియాపై పెట్టుకున్న ఆశలు దాసరికి పూర్తి నిరాశనే మిగిల్చినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బాలకృష్ణతో దాసరి నారాయణ రావు తన 150వ చిత్రాన్ని నిర్మించాలని భావించడం కూడా కాంగ్రెసు పెద్దలకు నచ్చడం లేదని అంటున్నారు. ఏమైనా దాసరి నారాయణ రావు దూరమవుతున్న స్థితిలో కాంగ్రెసు పార్టీ చిరంజీవితో స్నేహం నెరపడానికి సిద్ధపడింది.












Click it and Unblock the Notifications