రాజకీయం చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా: వైయస్ జగన్

YS Jagan
న్యూఢిల్లీ: తన ఖమ్మం జిల్లా ఓదార్పు యాత్రలో తాను రాజకీయం చేసినట్లు రుజువు చేస్తే తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సవాల్ చేశారు. తన ఓదార్పు యాత్రలో రాజకీయం లేదని, ఖమ్మం జిల్లా తెలంగాణలో భాగమేనని, ఖమ్మ జిల్లాలో ఐదు రోజుల పాటు 80 సభల్లో పాల్గొన్నానని, ఈ సభల్లో తాను రాజకీయం మాట్లాడినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రలో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, రాజకీయ నాయకుడిగా తాను ఓదార్పు యాత్ర చేయడం లేదని, ఓ తండ్రికి కుమారుడిగా ఈ యాత్రను చేపట్టానని ఆయన వివరించారు. తాను ఓదార్పు యాత్రను ఆపే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఎవరినీ వ్యతిరేకించే ఉద్దేశం తన ఓదార్పు యాత్రలో లేదని ఆయన స్పష్టం చేశారు.

తనకు శత్రువులు చాలా మంది ఉన్నారని, తనకూ అధిష్టానానికీ మధ్య కొంత మంది గోడ పెట్టాలని చూస్తున్నారని, తన మనస్సులో ఏ విధమైన కల్మషం లేదని, దేవుడు తన వైపు ఉన్నాడని, తన తండ్రి బతికే ఉన్నాడని భావిస్తున్నానని, అందువల్ల తనకు నష్టం జరగదని, వాస్తవాలను అధిష్టానానికి వివరిస్తానని, అధిష్టానం తన మాట నమ్ముతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. అధిష్టానం పెద్దలను కలిసి తనపై కల్పించిన అపోహలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తన తండ్రి మరణించి 9 నెలలు అవుతోందని, ఇంకా తాను బాధిత కుటుంబాలను పరామర్శించకపోతే ఆలస్యం జరుగుతుందని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని, అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ వరంగల్ జిల్లాకు చెందినవారు కారని, వారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారని ఆయన అన్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ తనకు అక్క, తల్లిలాంటిదని, మరో ఎమ్మెల్యే కవిత ఎస్టీ, తనకు చెల్లెలాంటిదని, ఎమ్మెల్సీ పద్మావతి ఎస్సీ అని, వారిపై తెలంగాణవారు దాడి చేశారని, తెలంగాణవారిపైనే వారు దాడి చేశారని ఆయన అన్నారు. తాను ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చానని, అధిష్టానం పెద్దల అపాయింట్ మెంటు అడిగానని, అవకాశం వస్తే అన్నీ వారికి వివరంగా చెప్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+