జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రకటన

కోత తీర్మానాలపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా శిబూ సోరేన్ ఓటు వేయడంతో జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. సొరేన్ వైఖరిపై మండిపడిన బిజెపి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధపడింది. అయితే, తదుపరి చర్చల్లో ఓ రాజీ ఫార్ములా కుదరడంతో రొటేషన్ పద్ధతిపై బిజెపి, జెఎంఎం అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి శిబూ సొరేన్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో బిజెపి సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
శాసనసభలో బల నిరూపణ చేసుకోవాల్సిన స్థితిలో సొరేన్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థితిలో గవర్నర్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించింది.












Click it and Unblock the Notifications