వైయస్ జగన్ ది గాలి జనార్దన్ రెడ్డి వ్యూహమేనా?

సోమవారం జరిగిన ఆర్థిక కమిటీ సమావేశంలో బిజెపి పార్లమెంటు సభ్యులు జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. బిజెపి నేతలు అహ్లూవాలియా, యశ్వంత్ సిన్హా, నిష్కాంత్ దూబే జగన్ చుట్టూ చేరి ఓదార్పు యాత్ర గురించి ఆసక్తిగా అడిగారు. బిజెపి అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లకు అత్యంత సన్నిహితుడైన నిష్కాంత్ దూబే చాలా సేపు జగన్ పక్కనే ఉన్నారు. జగన్ తమ పార్టీలోకి వస్తే మంచిదని నిష్కాంత్ దూబే కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడితో అన్నారు. అయితే, జగన్ తో మాట్లాడితే తమకేమి ముప్పు వస్తుందోననే భయంతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications