వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం సరైందే: మంత్రులు

జగన్ యాత్రకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టకర ఘటన జరిగిందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్టేషన్ బయట పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినా పరిస్థితి చేజారిందన్నారు. మహబూబాబాద్ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రోశయ్య రాళ్లు వేయించారని అనడం బాధ్యతారాహిత్యమైన ప్రకటన అని వైద్య ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు.
యాత్ర వద్దని అందరూ వారించినా జగన్ వినలేదని, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications