స్దానిక సంస్ధల ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయభేరీ

Mamata Banerjee
కోలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని 81 పురపాలక, నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు పార్టీ విజయభేరి మోగించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెసు అధిక మెజారిటీతో గెలుపొందింది. కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెసు, వామపక్షాల మధ్య నువ్వా? నేనా? అంటూ సాగిన ఈ ఎన్నికల పోటీకి దిగాయి. ఇందులో తన సమీప ప్రత్యర్ధి లెఫ్ట్ కూటమి పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెసు తో పొత్తు కుదరకపోయినా ఒంటరిగా పోటీ చేసి తృణమూల్ సత్తా చాటుకుంది. మొత్తం 141 వార్డులకు గాను 98 సీట్లు కైవసం చేసుకుని తృణమూల్ అగ్రభాగాన నిలిచింది. ఈ ఫలితాలు అధికార వామపక్ష కూటమికి చెంప పెట్టుగా రాజకీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ‌కు చెందిన 81 పురపాలక, నగర పాలక సంస్థల్లో, తృణమూల్ పార్టీ 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెసు పార్టీలు చిత్తుగా ఓడాయి. కాగా వచ్చే ఏడాది జరుగనున్న శాసససభ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని మమతా బెనర్జీ పార్టీకి ఎనలేని ప్రజల ఆదరణ లభించింది. ఫలితంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరిస్తారని మమతా విశ్వాసాన్ని ప్రజలు వమ్ము చేయలేదు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. తృణమూల్ పార్టీపై ప్రజలు అమితమైన నమ్మకం ఉంచారని చెప్పారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+