హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డంగా నరికేస్తామంటూ 'చిరుతపులుల' బెదిరింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Varavara Rao
హైదరాబాద్‌: తనను చంపుతామని చత్తీస్ ‌గఢ్‌ చిరుతపులుల పేరుతో బెదిరింపులు వస్తున్నాయని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నేత వరవరరావు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈనెల 10న నల్గొండ జిల్లాలో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు ఏర్పాటుచేసిన సభకు హాజరుకావద్దని తనను బెదిరించారని ఆయన తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

విరసం నేత వరవరరావుకు శనివారం రాత్రి ఛత్తీస్‌ గడ్ చిరుతపులుల పేరిట బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. "ఈనెల పదో తేదీన నల్లగొండ జిల్లాలో ఆపరేషన్ గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న సభకు వెళుతున్నావా..!? వెళితే అడ్డంగా నరుకుతాం'' అని ఆ ఆగంతకుడు హెచ్చరించాడు. అంతటితో ఊరుకోకుండా, రాయడానికి వీల్లేని మాటలతో తిట్టి ఫోన్ కట్ చేశాడు.

శనివారం రాత్రి 9-915 గంటల మధ్య 96666 47552 నెంబర్ నుంచి ఫోన్‌ కాల్ వచ్చిందని, ఛత్తీస్‌గడ్ నుంచి చిరుతపులిని మాట్లాడుతున్నానని హెచ్చరించాడని వరవరరావు తెలిపారు. వారం రోజుల కిందట కూడా అర్థరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో జెడ్డా నుంచి ఓ ఫోన్ వచ్చిందని, కుటుంబ సభ్యులు మాట్లాడారని, ఫోన్ ఎత్తడంతోనే నీవు మనిషివేనా..? అంటూ తిట్టడం మొదలుపెట్టి ఫోన్ కట్ చేశారని తెలిపారు.

మూడు రోజుల కిందట కూడా కొన్ని కాల్స్ వచ్చాయన్నారు. శనివారం వచ్చిన ఫోన్‌ కాల్ విషయాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, భాష, మాట్లాడిన తీరు చూస్తే మీ శాఖకు (పోలీసు) చెందిన వ్యక్తులే చేసి ఉంటారని ఆమెకు చెప్పానని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X