పక్కా ప్లాన్ తో ధిక్కారానికే వైయస్ జగన్ నిర్ణయం?

తన ఉద్దేశాన్ని ఆయన బుధవారం సూచనప్రాయంగా వెల్లడించినట్లు చెబుతున్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో గాయపడిన చికిత్స పొందుతున్న పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ను పరామర్శించారు. హర్షకుమార్ మొదటి నుంచీ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత శాసనసభ్యుడు మల్లాది విష్టు తండ్రి సుబ్బారావు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలోని నల్లగొండ మీదుగా హైదరాబాద్ చేరుకోవడంలో ఆయన వ్యూహం దాగి ఉందని అంటున్నారు.
రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించినట్లుగానే భావిస్తున్నారు. ఏదైనా జులై 8వ తేదీ తర్వాతనే నిర్ణయమని ఆయన అభిమానులకు చెప్పారు. దీన్ని బట్టి ఆయన 8వ తేదీన అధిష్టానం ఆదేశాలను ధిక్కరించైనా సరే ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications