వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటారు: కేశవరావు

Keshav Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోనే ఉంటారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు స్పష్టం చేశారు. జగన్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపిలో చేరుతారని వచ్చిన వార్తలో నిజం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ను మీడియా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన విమర్శించారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నినాదంతోనే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెరాసతో కాంగ్రెసు కుమ్మక్కయిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+