హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుకు హరికృష్ణ లేఖపై రామచంద్రయ్య ఎలా చెప్తారు: టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్‌: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణను ప్రశ్నించే నైతిక హక్కు ప్రజారాజ్యం నేత రామచంద్రయ్యకు లేదని తెలుగుదేశం నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య అన్నారు. తమ పార్టీ ఉన్నప్పుడు పదవులను అనుభవించి ఉన్నత స్థానానికి ఎదిగిన రామచంద్రయ్య హరికృష్ణను విమర్శించడం చూస్తుంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా కనిపిస్తోందని వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హరికృష్ణ చిరంజీవికి బహిరంగ లేఖ రాస్తే రామచంద్రయ్య ఎలా సమాధానమిస్తారని వారు అడిగారు.

సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలపై గతంలో చిరంజీవి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తుతం సరిదిద్దుకుంటున్నారని అందుకు అనుగుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన నీతి నిజాయతీ గురించి ప్రజలందరికీ తెలుసునని, ప్రత్యేకించి మంత్రి దానం నాగేందర్‌ తనకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. తనపై అక్కసుతోనే అభాండాలు వేస్తూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు తన కుటుంబ సభ్యులకు రాజధానిలో వందల కోట్ల ఆస్తులున్నట్లు వస్తున్న ఆరోపణలపై గాలి స్పందిస్తూ...ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చూపెడితే వారికే రాసిస్తానని వ్యాఖ్యానించారు. అవినీతిని బయటపెట్టడమే తన లక్ష్యమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X