సత్యం రామలింగ రాజుకు తగ్గని వ్యాధి: కేసు విచారణ వాయిదా

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్ మాజీ చీఫ్ రామలింగరాజు కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పీవీఎల్ ‌ఎన్‌ చక్రవర్తి తెలిపారు. రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలన్న అంశంపై ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్‌)లో చికిత్స పొందుతున్న రామలింగరాజు ఇప్పట్లో కోర్టుకు వచ్చే పరిస్థితి లేనందున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని సీబీఐ వాదించింది.

సత్యం కేసులో సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని ఏ అభియోగాలపై విచారణ జరుపుతారో ముందు తేల్చాలని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. మూడు ఛార్జిషీట్లు కలిపి ఒకే కేసుగా విచారణ జరపాలని వారు కోరారు. ప్రస్తుత దశలో వీడియో కాన్ఫరెన్స్‌ విచారణ అవసరమే లేదని అన్నారు. ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్‌ వైద్యులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆయనకు హైపటైటిస్‌ బి తీవ్రంగా ఉందని 24 వారాల పాటు చికిత్స అవసరమని వైద్యులు నివేదికలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+