భోపాల్ సంఘటనపై సోనియా క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu
హైదరాబాద్‌: భోపాల్ దుర్ఘటన కేసుపై దేశప్రజలకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. భోపాల్ దుర్ఘటన కేసులో కాంగ్రెసు పార్టీ తీరు క్షమార్హం కాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీలో అవినీతిలో పోటీ పడేవారే ఉంటారని, ఆ పార్టీలో నీతిమంతులకు స్థానం లేదని ఆయన విమర్శించారు.

జలయజ్ఞంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అవినీతిపై ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ధైర్యం ఉంటే పొన్నాలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ లోగా ధరలు తగ్గించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం నుంచి దిగిపోతాయా అని ఆయన సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+