చంద్రబాబుకు రెండు కళ్లంట కదా: జస్టిస్ శ్రీకృష్ణ

రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులను తెలంగాణ మెడికల్ ఫోరం నేతలు కలిసి తమ వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని, అది ఎమర్జెన్సీ కేసు అని వారన్నారు. మరోవైపు శ్రీకృష్ణ కమిటీకి గురువారం పలు ప్రభుత్వ శాఖలు నివేదికలు అందించనున్నాయి. గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను అధికారులు కమిటీకి అందించనున్నారు. 610 జీవో అమలుపై సాధారణ పరిపాలన శాఖ నివేదికను ఇవ్వనుంది. ప్రణాళిక, ఆర్థిక, విద్య తదితర విభాగాల అధికారులు శాఖ పరమైన అంశాలపై కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. కాగ్ అధికారులు కూడా కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications