జగన్ యాత్రకు చెక్: జులై 8న వైయస్ జయంతి

వైయస్సార్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున జులై 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జగన్ ను కూడా ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాలా, శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్ర చేపట్టాలా అనే విషయాన్ని జగన్ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు రోశయ్య నిర్ణయించుకున్నారు. అయితే, జగన్ ఓదార్పు యాత్ర చేపడితే శాసనసభ్యులు పాల్గొనాలని ఏమీ లేదని పిసిసి ప్రధాన కార్యదర్శి, జగన్ మద్దతుదారు అంబటి రాంబాబు అంటున్నారు.












Click it and Unblock the Notifications