అండర్సన్ ను పంపించడంలో పివి పాత్ర లేదు: వెంకయ్య

ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక పాల్గొనబోనని స్పష్టంచేసిన వెంకయ్య పార్టీ కోసమే పూర్తి సమయం కేటాయిస్తానన్నారు. వరుసగా మూడుసార్లు రాజ్యసభకు పంపి అరుదైన గౌరవాన్ని తనకు ఇచ్చిన పార్టీ అదిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆత్మాహత్యా సదృశ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇటు ప్రత్యామ్నాయంగా తెదేపా కూడా విఫలమైందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను భాజపా వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్‌లో 2014కల్లా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్నారు. అధిక ధరలకు కారణమైన యూపీఏను ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు విచారిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం అసంబద్ధ విధానాలతో ప్రజలను హింసిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications