బీజింగ్: చైనాలో వర్ష బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. భారీ వర్షాలకు దక్షిణ చైనా అతాలకుతలం అవుతోంది. ప్రకృతి కన్నెర్రకు బీజింగ్ పరిసర ప్రాంతాల్లో వేలాదిమంది రోడ్డున పడ్డారు. ఈ నెల 13 నుంచి చైనాలో ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు భారీగానే నష్టం సంభవించింది.
మృతి చెందిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి వరకూ మృతులు సంఖ్య 132కు చేరుకుంది. ఇంకా 86 మంది ఆచూకి లభ్యంకాలేదు. ఈ భారీ వర్షాలకు వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులవ్వగా, లక్షల సంఖ్యలో నష్టపోయారు.