హైదరాబాద్: మత్స్య కారులకు హామె ఇచ్చినా చిరంజీవి వాతావరణ భయానికి ఆగిపోయారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. నేవల్ బేస్ కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చూడాలంటూ మత్స్యకారులు రెండు రోజుల క్రితం చిరంజీవికి మొరపెట్టుకోవడంతో స్వయంగా వచ్చి వారి గోడు వింటానని వారికి హామీఇచ్చారు.
ఈ మేరకు ఈరోజు ఆయన విశాఖకు వెళ్లాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో చిరంజీవి పర్యటనను రద్దు చేసుకున్నారు.