బీహార్ లో బస్సు - ట్రక్కు ఢీ: 17 మంది మృతి

పాట్నా నుంచి గయా వెళుతున్న బస్సు ధనరుయా వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి, మరి కొంతమందిని ధనరుయా, మసౌరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు పైకప్పు మీద కూడా ప్రయాణికులు కూర్చున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 50 వేల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications