పెట్రో ధరలపై దిగొచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతుండడంతో పెట్రో ధరల పెంపుపై ముఖ్యమంత్రి కె. రోశయ్య దిగొచ్చారు. పెట్రో ధరల పెంపు వల్ల ప్రజలపై భారం పడకుండా చూస్తామని ఆయన శనివారం హామీ ఇచ్చారు. పెరిగిన పెట్రో ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మకం పన్ను ద్వారా అదనంగా 540 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఆ మొత్తాన్ని ప్రజల అవసరాలకు వాడేలా ప్రణాళిక రూపొందిస్తామని ఆయన చెప్పారు. దీనిపై జూలై 1వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

కాగా, పెంచిన పెట్రో ధరలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కట్టెలపై వంటలు వండుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ కార్యకర్తలు కూడా హైదరాబాదులో ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లో ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. కొన్ని చోట్లు రాస్తారోకోలు కూడా నిర్వహించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+