హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికలు: బాబ్లీపై టిడిపి పోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలంగాణలోని పది శాసనసభా స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీతో పాటు 12 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం నాయకులు తమ ఉద్యమానికి పదును పెడుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతోందని వారు ఆరోపిస్తున్నారు. అక్రమ ప్రాజెక్టులను ఆపించడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని, బాబ్లీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి తమతో కలిసి రావడం లేదని ప్రజలకు తెలియజేసి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలుగుదేశం ఈ పోరును ప్రధానం చేసుకుంది.

తమ పోరాటంలో భాగంగా తెలుగుదేశం నాయకులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కోరారు. అలాగే, మంగళవారం తెలుగుదేశం ప్రతినిధి బృందం ఒకటి ఢిల్లీ వెళ్తోంది. కేంద్ర జల వనరుల సంఘం (సిడబ్ల్యుసి) అధికారులను, కేంద్ర జల వనరుల మంత్రి బన్సాల్ ను వారు కలుస్తారు. బాబ్లీ, ఇతర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని వారు కోరనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X