జగన్ ఓదార్పుపై హైకమాండ్ మాటే : వీరప్ప మొయిలీ

Veerappa Moily
బెంగళూరు: కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పుయాత్ర పై పార్టీ అధిష్ఠానం వెల్లడించిన అభిప్రాయమే వేదమని దానిపై మరోమాట లేదని కేంద్ర న్యాయ మంత్రి, కాంగ్రెస్‌ ఆంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ స్పష్టీకరించారు. యాత్రపై జగన్మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు తనను సంప్రదించలేదని, ఎలాంటి విషయాలు చర్చించలేదని చెప్పారు. ఇప్పటికే యాత్రపై అధిష్ఠానం స్పష్టమైన వైఖరి ప్రకటించిందని ఇంక కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు.

మొయిలీ మాటలను జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వడం లేదనేది అర్థమవుతోంది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచించాలని శుక్రవారం ముగ్గురు పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. అయితే, ఓదార్పుపై సోనియా ప్రస్తావిస్తే తప్ప తాను మాట్లాడబోనని రోశయ్య వారితో చెప్పారు. జగన్ యాత్రకు వెళ్తే తాము భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+