ధిక్కారానికి రెడీ: దేనికైనా వైయస్ జగన్ సిద్ధం

ఓదార్పు యాత్రకు మాటిమాటికీ అనుమతి అవసరం లేదని కాంగ్రెసు నాయకుడు గట్టు రామచంద్ర రావు అన్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిందని, చిన్న ఆటంకం రాకపోతే ఇప్పటికే మరో రెండు జిల్లాల పర్యటన ముగిసి ఉండేదని ఆయన అన్నారు. మొదటిసారి ఓదార్పు యాత్రకు వెళ్లే సమయంలో జగన్ ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారని, అందువల్ల మాటిమాటికీ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రతో పార్టీకి సంబంధం లేదని, ఇది పూర్తిగా జగన్ వ్యక్తిగతమని, దీన్ని తమ గురువు, ముఖ్యమంత్రి కె. రోశయ్య అర్థం చేసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications