శ్రీకృష్ణదేవరాయల పాలన ఎప్పటికీ ఆదర్శం: రాష్ట్రపతి

ఆయన పాలనా యంత్రాంగం తీరు ఇప్పటికీ మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నారు. సామ్రాజ్య విస్తరణే కాకుండా ప్రజల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన సాటిలేని పాలకుడిగా పేరు పొందారని అన్నారు. ప్రజల మనస్సులను గెలుచుకున్న ఆయన పంచశతాబ్ది ఉత్సవాలను నిర్వహించ తలపెట్టినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆమె అభినందించారు. ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అంతకుముందు గవర్నర్ నరసింహన్ కృష్ణదేవరాయల గొప్పతనాన్ని గుర్తు చేశారు. సీఎం ప్రసంగిస్తూ మన ప్రాంతాన్ని పరిపాలించారు కనుక కృష్ణదేవరాయల పట్టాభిషేక ఉత్సవాలను జరపటం లేదని ప్రజల మనస్సులు గెలుచుకున్న గొప్ప పాలకుడు కనుక జరుపుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా మాట్లాడారు. జె. గీతారెడ్డి తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రతిభా పాటిల్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications