షోకాజ్ నోటీసుపై అంబటి రాంబాబు గరం గరం

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేసినవారి మీద, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఎవడని అడిగినవారిపై చర్యలు తీసుకోలేదని, తనపైనే చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణలోని 12 స్థానాలకు పోటీ చేయాలనే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించినవారిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. పిసిసి నిబంధనావళికి విరుద్ధంగా తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని ఆయన విమర్శించారు. వివరణ ఇవ్వడానికి పది రోజుల గడువు కోరానని, ఈ నెల 31 వరకు పిసిసి క్రమశిక్షణా సంఘం తనకు గడువు ఇచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications